ఖోఖో బాలబాలికల జట్టు ఎంపిక

కులకచర్ల : విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చి మండలానికి మంచిపేరు తీసుకురావాలని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో జట్టుకు విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చి గ్రామానికి, మండలానికి, పాఠశాలకు పేరు తీసుకురావాలని అన్నారు. గ్రామీణ విద్యార్థులే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు.
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఖోఖోలో మంచి ప్రతిభను కనబర్చాలని సూచించారు. సందర్భంగా ఖోఖో జట్టు ఎంపికలో 50మంది బాలురు, 30మంది బాలికలు పాల్గొనగా అందులో ఉత్తమ ప్రతిభను కనబర్చి 18మంది బాలురు, 16మంది బాలికలను జిల్లా జట్ల ప్రబుల్స్కు ఎంపిక చేశారు. వీరికి ఇదే మైదానంలో ఈ నెల 18 నుంచి 28వరకు క్యాంపు నిర్వహిస్తున్నట్లు పీటీ సుభాష్‌నాయక్ తెలిపారు. కార్యక్రమంలో దోమ ఎంఈవో హరిశ్చందర్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఖోఖో సంఘం సభ్యులు సత్తిరెడ్డి, శివరాం, రంజిత్, శ్రీనివాస్, స్వాతి, జాట్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

