డ్రిప్ సహయంతో కూరగామల సాగు
గతంలో వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు కొంత మంది రైతులు. ఆరు గాలం కష్టపడి పండించే పంటకు తక్కువ ఆదాయం వచ్చేది. గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులు, ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు సాగు చేసిన రైతులు లాభాలు తప్పా, నష్టాలు అనే మాటే మరిచారు.
- తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం
- నారాయణపూర్‌లో 500 ఎకరాల్లో సాగు
- సంవత్సరానికి మూడు పంటలు
- హైదరాబాద్‌కు కూరగాయల తరలింపు
- ప్రతి రోజూ ఆదాయం, చేతి నిండా పని
- నెలకు ఒక్కో రైతుకు 50 నుంచి 60 వేల ఆదాయం
- ఆనందంలో అన్నదాతలు
- ఎంతో మందికి నిత్యం ఉపాధి
వికారాబాద్, డిసెంబర్ 5 : గతంలో వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు కొంత మంది రైతులు. ఆరు గాలం కష్టపడి పండించే పంటకు తక్కువ ఆదాయం వచ్చేది. గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులు, ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు సాగు చేసిన రైతులు లాభాలు తప్పా, నష్టాలు అనే మాటే మరిచారు. వికారాబాద్ మండలం నారాయణపూర్‌లో 70 నుంచి 80 శాతం వరకు రైతులు సుమారు 500 ఎకరాల వరకు రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. ఈ సాగుతో తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించే అవకాశాలున్నాయి.
సంవత్సరానికి మూడు పంటలు తీయవచ్చు. బోరు, బావుల సహాయంతో నీటిని వినియోగించుకోవచ్చు. డ్రిప్ సహాయంతో రైతులు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగు చేస్తున్నారు. పండించిన పంటలను వాహనాల ద్వారా ప్రతి రోజూ హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. ప్రతి రోజూ ఆదాయం, చేతి నిండా పని ఉండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఒక్కో రైతుకు నెలకు దాదాపు రూ.50 నుంచి 60 వేల వరకు ఆదాయం వస్తున్నది.
పండ్ల గ్రామంలో 15 ఎకరాల్లో జామ, మరో 15 ఎకరాల్లో మామిడి పండ్ల తోటలు రైతులు సాగు చేస్తున్నారు. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, టమాట, బీరకాయ, సొరకాయ, మిర్చి, బీట్రూట్, బెండకాయ, దొండకాయ, చిక్కుడు కూరగాయలతో పాటు వివిధ రకాల ఆకుకూరలు కూడా సాగు చేస్తున్నారు.
గ్రామంలోనే ఉపాధి
రైతులు కూరగాయల సాగు చేయడం ద్వారా నిత్యం పనులు జరుగుతాయి. ప్రతి రోజూ కూరగాయలను తెంపడం, శుభ్రం చేయడం, బస్తాల్లో నింపడం వంటి పనులు చేయడంలో కూలీలు అధికంగా అవసరం ఉంటారు. 500 ఎకరాల్లో కూరగాయల సాగు చేయడంతో నిత్యం పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఒక పక్క నారు వేయడం, మరో పక్క పంటలు తీయడంలో రైతులు బిజీబిజీగా మారిపోయారు. స్టేకింగ్ వేయడంతో పొలంలో పిచ్చి మొక్కలు పెరగడం, వాటికి గడ్డి మందు కొట్టడం వంటి పనులు లేకుండా పోయాయి. ఆధునిక పద్ధతులను ఉపయోగించి పనులు చేస్తున్నారు.
పలు రకాల కూరగాయల సాగు
మాకు 20 ఎకరాల పొలం ఉంది. ఇందులో పలు రకాల కూరగాయల పంటలు సాగు చేస్తా. పొలం పనులు చేయడంతో పాటు ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. వివిధ యంత్రాల సహాయంతో పంటలు సాగు చేస్తున్నాం. సొరకాయ, బీరకాయ, క్యారెట్ వంటి తదితర కూరగాయలు పండిస్తున్నా. కూరగాయలను బస్తాల్లో నింపి ప్రతి రోజూ వాహనాల ద్వారా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు తరలిస్తున్నాం. సంవత్సరానికి మూడు పంటలు తీసే అవకాశం ఉంటుంది.
– సుభాన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, నారాయణపూర్, వికారాబాద్
డ్రిప్ సహాయంతో సాగు
డ్రిప్ సహాయంతో కూరగాయలను సాగు చేస్తున్నాం. తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుపై ఆసక్తి పెరగడంతో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాం. కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల సహాయంతో పంటలు సాగు చేస్తున్నాం. గ్రామంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తుంటాం. వీటిని నిత్యం హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. యంత్రాలు రావడంతో అన్నదాతలకు కూలీల కొరతతో ఇబ్బందులు దూరమయ్యాయి. రైతు ఒక్కడు ఉంటే చాలు నిమిషాల్లో ధాన్యం ఇంటికి చేరుతుంది.
– మమత, రైతు, నారాయణపూర్, వికారాబాద్
మరికొంత మందికి ఉపాధి
గ్రామంలో ఎక్కువ మంది కూరగాయలు సాగు చేయడంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. కూరగాయల పంటలు సాగు చేస్తే నిత్యం పనులు దొరుకుతాయి. కూరగాయలు సాగులో కూలీల ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పంటలను కూడా వేసేందుకు అవకాశాలున్నాయి. డ్రిప్ సహాయంతో పంటలు సాగు చేస్తున్నాం. ప్రస్తుతం క్యారెట్, మిర్చి తదితర పంటలు పండిస్తుండటంతో చేతి నిండా పని దొరుకుతున్నది. లాభాలు తప్ప నష్టాలు రావు.
– సుభాన్‌రెడ్డి, రైతు, నారాయణపూర్, వికారాబాద్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

