నీటి సంరక్షణలో భేష్
ఐదో జాతీయ వాటర్ అవార్డుకు వికారాబాద్ జిల్లా ఎంపికైందని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. గురువారం కేంద్ర జల వనరుల శాఖ, భూగర్భ జల బోర్డు సభ్యుల బృందం జిల్లాలో పర్యటించి.. నీటి సంరక్షణకు తీసుకున్న చర్యలను అదనపు కలెక్టర్‌తో చర్చించింది.
- వికారాబాద్ జిల్లాకు ఐదో జాతీయ వాటర్ అవార్డు
- జిల్లాలో పర్యటించిన కేంద్ర జలవనరుల శాఖ, భూగర్భ జల బోర్డు సభ్యుల బృందం
వికారాబాద్, మే 16 : ఐదో జాతీయ వాటర్ అవార్డుకు వికారాబాద్ జిల్లా ఎంపికైందని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. గురువారం కేంద్ర జల వనరుల శాఖ, భూగర్భ జల బోర్డు సభ్యుల బృందం జిల్లాలో పర్యటించి.. నీటి సంరక్షణకు తీసుకున్న చర్యలను అదనపు కలెక్టర్‌తో చర్చించింది. ఈ సందర్భంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని జల్‌శక్తి అభియాన్ కేంద్రాన్ని బృందం సభ్యులు సందర్శించారు. అనంతరం వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామపంచా యతీలో ఉపాధి హామీ పథకం, పీఎంకేఎస్‌వై వాటర్‌షెడ్ పథకాల్లో భూగర్భజలాల పెంపునకు చేపట్టిన పనులు, నీటికుంటలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ నీటి ఇంకుడుగుంతలు, కందకాలు, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతివ నాలు, చెక్ డ్యామ్‌లు తదితర పనులను పర్యవేక్షించారు.
నీటి వనరుల వృద్ధిపై గ్రామస్తులతో ఆరా తీసి నీటి సంరక్షణ భేష్ అని కితాబునిచ్చారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గంగ్యాడ గ్రామంలో నిర్మించిన చెక్ డ్యామ్‌ను, పూడూరు మండలం లోని మీర్జాపూర్లో నిర్మించిన నీటి సంరక్షణ పనులను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీసీఈవో సుధీర్, డీపీవో జయసుధ, డీజీ డబ్ల్యూవో దీపారెడ్డి, డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్, వికారాబాద్ ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో నాగరా జు, పీవో వాటర్ షెడ్ సతీశ్‌రెడ్డి, ఈజీఎస్ సిబ్బంది, జేఎస్ఏ జిల్లా కో-ఆర్డినేటర్ సైదులు, ఐఈసీ నోడల్ అధికారి శ్రీధర్, ఏపీవో శ్రీనివాస్, ఈసీ నవీన్, టీఏ భీమయ్య, క్షేత్ర సహాయకులు కిష్టయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
Bridge Lacks Access Road | మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగం
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

