నీరే ఆధారం!
ఎర్రటి ఎండల్లో నెర్రెలు బారిన నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం!
నేడు ప్రపంచ జల దినోత్సవం
ఎర్రటి ఎండల్లో నెర్రెలు బారిన
నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం!
నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు
తగ్గించేసినా చెమటల్లో తప్ప నీటిని
నిజంగా చూడలేని నిస్సహాయత
ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి
ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే
కానరాని నీటి జాడ కోసం అన్వేషణ!
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..
అమృతదారల్లాంటి వర్షపు నీళ్లు
నేలపాలైన గాజు ప్రతిమలా వెక్కిరిస్తుంటే
ఆ ముత్యపు బిందువుల్ని గుదిగుచ్చి
భద్రంగా దాచుకొలేని నిర్లక్ష్య ఫలమిది
నదుల ఊపిరి తీసేలా ప్రవాహ దారుల్ని
కాచి రిసార్టుల్ని గుండెలపై అదిమేసి
నదీమ తల్లిని ఎముకల గూడు చేసి
అడవుల్లో ఆటవిక రాజ్యం స్థాపించి
పచ్చదనాన్ని నల్లధనంగా మార్చేసి
నేలతల్లి గుండెల్లోకి ఎండిన బోర్లేసి
భూగర్భజలాలకు గర్భశోకం తెచ్చిపెట్టి
అవినీతి సంపాదనకే పథకాలు తప్ప
సాగునీటికి తాగునీటికి ప్రణాళికలు
లేని దూరదృష్టిరాహిత్యపు దురదృష్టాల్ని
వెంటేసుకొని ఎండిన బావుల చుట్టూ
ఆవురావురుమని మూగే కాకులమయ్యాం!
ఖాళీ బిందెలు బీళ్లు పడిన నేలలు
ఎండిన గొంతుకలతో పాడిపంటలు కరవై
ఎడారి కష్టాలై తడారిన బతుకులయ్యాయి
పరిసరాలు ఎండి గుండె తడి ఆవిరయ్యాక
ఇకనైనా మనం కళ్లు తెరవాలి తప్పదు!
ప్రతి నీటి బిందువు సాక్షాత్తూ అమృత
బిందువేనని గుర్తించి నీటిని పూజించాలి!
భీమవరపు పురుషోత్తమ్
99498 00253
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

