ఐదు నెలలుగా పస్తులే
నెలవంక దర్శనంతో ప్రపంచవ్యాప్తంగా గత సోమవారం రంజాన్ మాసం ప్రారంభమైంది. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టి ముస్లింలు తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే గాజాలో మాత్రం ఎప్పుడో ఉపవాస దీక్షలు మొదలైపోయాయి. ఎందుకంటే, తిండే దొరక్క అల్లాడుతున్న అక్కడి ప్రజలు ఎప్పటినుంచో ఒక్కపూట తింటుండటమే అందుకు కారణం.
నెలవంక దర్శనంతో ప్రపంచవ్యాప్తంగా గత సోమవారం రంజాన్ మాసం ప్రారంభమైంది. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టి ముస్లింలు తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే గాజాలో మాత్రం ఎప్పుడో ఉపవాస దీక్షలు మొదలైపోయాయి. ఎందుకంటే, తిండే దొరక్క అల్లాడుతున్న అక్కడి ప్రజలు ఎప్పటినుంచో ఒక్కపూట తింటుండటమే అందుకు కారణం.
ఐదు నెలలుగా భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటున్న గాజా ప్రజలు దయనీయమైన పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. మానవతాసాయం కింద అందే ఆహారమే వారికి దిక్కవుతున్నది. ఇజ్రాయెల్ దాడులతో రంజాన్ మాసంలోనూ గాజా భూతల నరకాన్ని తలపిస్తోంది. శిథిలాల మధ్యే అక్కడి ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఆహారం దొరకగానే ఓ యువతి ఎగిరి గంతేసిన దృశ్యం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులతో ఆ ప్రాంతంలోని వ్యవసాయ భూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాంబుల మోతతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. మరోవైపు మానవతాసాయం కింద ఆహార పదార్థాలు తెస్తున్న ట్రక్కులు భద్రతా తనిఖీలు దాటుకొని గాజాలోకి వెళ్లడం కష్టతరంగా మారింది. దీంతో గాజాలోని సుమారు సగం జనాభా (11 లక్షలు) తమకు తెలియకుండానే ఉపవాసం చేస్తున్నారు. జూలై నాటికి మిగతా ప్రజలు కూడా ఈ క్షామాన్ని ఎదుర్కొంటారని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ పేస్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) నివేదించింది.
ఉత్తర గాజాలో ఆహార సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఊపిరి సలపని యుద్ధంతో అక్కడి పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ట్రక్కులను ఇజ్రాయెల్ అడ్డుకుంటుండటంతో వివిధ దేశాలు విమానాల ద్వారా ఆహార పదార్థాలను జారవిడుస్తున్నాయి. వాటి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా 31 వేల మందికి పైగా పౌరులు మరణించగా.. ఆహార సంక్షోభం కారణంగా మరికొంత మంది తనువు చాలిస్తున్నారు.
తీవ్రమైన ఆహార కొరత కారణంగా గాజా ప్రజలు కలుపు మొక్కలు తింటుండటం అక్కడి పరిస్థితికి నిదర్శనం. స్థానికంగా పెరిగే మాలో జాతి మొక్కలను వారు తిని ప్రాణాలను కాపాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. పిల్లలకు వాటినే తినిపిస్తుండటం బాధాకరం. అమాయకులైన పసి పిల్లలు, మహిళలను బలి తీసుకుంటున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. వేల మందిని పొట్టనబెట్టుకున్న సమరాన్ని ఇప్పటికైనా ఆపాలి. ప్రపంచ దేశాలు అందుకు నడుం బిగించాలి. లేదంటే ప్రపంచ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం.
ఇస్కా రాజేష్‌బాబు
93973 99298
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
- Tags
- Crescent Moon
- Muslims
- Ramadan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

