పీఆర్సీపై సర్కార్ ఎడతెగని నిర్లక్ష్యం
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడంలేదు. పాలకుల నిర్వాకంతో పీఆర్సీ కాలాన్ని నష్టపోయే ప్రమాదం నెలకొన్నది. మే 2న ముఖ్యమంత్రి టీజీఈజేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ, సెప్టెంబర్ 9న సీఎస్ ఇచ్చిన మాటలు నీటిమూటలయ్యాయి. 206 సంఘాలతో ఉన్న టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకులు, కొత్తగా జేఏసీలో విలీనమైన మరో జేఏసీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనం, సొంత పనులు చేయించుకోవడం కోసం హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే అనుమానం కలుగుతున్నది.
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడంలేదు. పాలకుల నిర్వాకంతో పీఆర్సీ కాలాన్ని నష్టపోయే ప్రమాదం నెలకొన్నది. మే 2న ముఖ్యమంత్రి టీజీఈజేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ, సెప్టెంబర్ 9న సీఎస్ ఇచ్చిన మాటలు నీటిమూటలయ్యాయి. 206 సంఘాలతో ఉన్న టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకులు, కొత్తగా జేఏసీలో విలీనమైన మరో జేఏసీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనం, సొంత పనులు చేయించుకోవడం కోసం హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే అనుమానం కలుగుతున్నది.
టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకులు తమ స్వార్థం కోసం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లను మోసం చేయడం సరికాదు. సెప్టెంబర్ 10న మహా ఉధృతంగా ఉన్న మహా ధర్నా కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవడం వెనుక సందేహాలు తలెత్తుతున్నాయి. సెప్టెంబర్ 10న ఉద్యమ కార్యాచరణ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీఆర్సీ చైర్మన్‌కు ఇచ్చిన లేఖతో మహాధర్నా కార్యక్రమాన్ని ఉపసంహరించుకుని సెప్టెంబర్ 19-23 మధ్యలో జరిగిన చర్చల ఫలితంగా పెండింగ్‌లోని ఆరు డీఏలకు కేవలం రెండు డీఏలు సాధించినామని గొప్పలు చెప్పడం అసమర్థ నాయకత్వానికి నిదర్శనం. ఇదంతా టీజీఈజేఏసీ నాయకత్వం వైఫల్యమే. ఉద్యమ, పోరాట స్వభావం కలిగి చైతన్యవంతంగా ఉండే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నాయకులు కూడా నిమ్మకునీరెత్తినట్టుగా నిశ్శబ్దంగా ఉండడం ఉపాధ్యాయ లోకం జీర్ణించుకోలేకపోతున్నది. నిస్తేజంగా ఉండడం సమర్థవంతమైన నాయకత్వ లక్షణం కాదు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ ద్వారా సెప్టెంబర్ 9న పీఆర్సీ చైర్మన్‌ను ఆదేశించినప్పటికీ 40 రోజులు దాటినా రిపోర్టు సమర్పించకపోవడం, ఇదంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నది. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం మూడేండ్లు దాటినా పీఆర్సీ అమలు చేయకుండా మోసం చేస్తున్నది. ఇది ఉద్యోగులను వంచించడం కాదా? రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఆశలపై సర్కార్ నీళ్లు చల్లుతున్నది. ప్రతిసారీ ఏదోరకంగా మోసం చేస్తున్నది. కనీసం పీఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోలేకపోతున్నది. సీఎస్ ఇచ్చిన హామీకీ అతీగతీ లేదు. అక్టోబర్ చివరి వరకు పీఆర్సీ రిపోర్టును ప్రభుత్వం తెప్పించుకుని దీపావళి పండుగలోపు రెండో పీఆర్సీని వర్తింపజేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.
టీజీఈజేఏసీ నాయకులు పీఆర్సీ సాధన కోసం ఐక్యంగా పోరాడాలి. నీతి, నిజాయితీ, స్వార్థరహితంగా, సేవా భావంతో పనిచేయాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే దీపావళి తర్వాత ఉద్యోగ జేఏసీ నవంబర్‌లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుంది. ఉద్యోగుల పెన్‌డౌన్ కార్యక్రమం, టీచర్ల సామూహిక సెలవులు పెట్టడం కోసం సమ్మె నోటీసులను ఇస్తారు. మరోసారి తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి పెన్షనర్ల జేఏసీ నాయకులు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా టీజీఈజేఏసీ నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. పీఆర్సీ, 50% పిట్మెంట్, నగదు రహిత వైద్యానికి హెల్త్ కార్డుల జారీ దిశగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి. పంజాబ్‌లో పెండింగ్ డీఏల, ఓపీఎస్ సాధన, ఇతర సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 21, 22 తేదీల్లో లక్షలాది మంది ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టారు. సెక్రటేరియట్ ముందు చేసిన ధర్నాకు దిగారు. తెలంగాణలోనూ అలాంటి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత టీజీఈజేఏసీ నాయకత్వంపై ఉన్నది.
(రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధి)
కందుకూరి దేవదాసు
9949937745
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

