Richest Royal Family: ప్రపంచంలో అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిదో తెలుసా..?
ప్రపంచంలో అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిది అని అడిగితే మీరు ఏం చెప్తారు.. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ అని మీరనుకుంటున్నట్లైతే మీ అభిప్రాయం తప్పు. ఇటీవల ఒక సర్వేలే అత్యంత ధనిక రాజకుటుంబాలు మధ్యప్రాచ్య దేశాల కుటుంబాలుగా తేలింది.
Richest Royal Family: ప్రపంచంలో అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిది అని అడిగితే మీరు ఏం చెప్తారు.. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ అని మీరనుకుంటున్నట్లైతే మీ అభిప్రాయం తప్పు. వాస్తవానికి బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ అపారమైన సంపద, భారీ ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం మాత్రం కాదు. ఇటీవల ఒక సర్వేలే అత్యంత ధనిక రాజకుటుంబాలు మధ్యప్రాచ్య దేశాల కుటుంబాలుగా తేలింది.
ఇక అత్యంత ధనిక రాజకుటుంబం సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ(Royal Family of Saudi Arabia). సౌదీ రాజకుటుబం ఆస్తుల విలువ 1.4లక్షల కోట్ల అమెరికన్ డాలర్ల కంటే కూడా ఎక్కువే ఉంటుందట. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ కుటుంబంలో 15వేల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు.
సౌదీ కుటుంబం ప్రైవేట్ జెట్లు, బోట్స్, బంగారు పూతతో కూడిన కార్లతో పాటు అనేక ఖరీదైన వాహనాలను కలిగి ఉంది. సౌదీ కింగ్ అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. ఈ ప్యాలెస్ 4 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోని అతిపెద్ద చమురు క్షేత్రాల నుంచి వీరి అధిక మొత్తంలో సంపద వస్తుంది.
సౌదీ కుటుంబం తర్వాత అత్యంత ధనిక రాయల్ ఫ్యామిలీ కువైట్ రాజకుటుంబం. కువైట్ రాజకుటుంబం మొత్తం ఆస్తుల విలువ 360 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.2,95,39,98,00,00,000. చార్లెస్ 3 నేతృత్వంలోని బ్రిటీష్ రాజకుటుంబం ప్రపంచంలో రిచెస్ట్ రాయలీ ఫ్యామిలీ లిస్ట్‌లో 5వ స్థానంలో ఉంది. బ్రిటీష్ రాజకుటుంబం సంపద 88 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.7.22లక్షల కోట్లు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

