గర్ల్‌ఫ్రెండ్ కోసం : యువతి గెటప్‌లో పరీక్ష రాస్తూ అడ్డంగా బుక్కయ్యాడు!

న్యూఢిల్లీ : ప్రియురాలి కోసం ఎంతకైనా తెగించే వారిని చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిలవుతానని భయపడుతున్న గర్ల్‌ఫ్రెండ్ కోసం యువతి వేషధారణలో వెళ్లి అడ్డంగా బుక్కైన ప్రియుడి ఉదంతం ఆఫ్రికాలోని సెనెగల్‌లో వెలుగుచూసింది. హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఫెయిలవుతానని భయపడుతున్న గర్ల్‌ఫ్రెండ్ గంగూ డియోం (19) కోసం తానే ఆ పరీక్ష రాయాలని ప్రియుడు ఖాదిం బూప్ (22) సిద్ధమయ్యాడు. అయితే డియోంలా కనిపించకపోయినా విగ్గుతో పాటు డ్రెస్, బ్రా, చెవిదిద్దులు ధరించి, తన గర్ల్‌ఫ్రెండ్ మాదిరిగా మేకప్ చేసుకుని యువతి గెటప్‌లో పరీక్షా కేంద్రానికి వెళ్లాడు.
ఆమె స్ధానంలో మూడు రోజుల పాటు ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. నాలుగోరోజు అతడి తీరుపై అనుమానం వచ్చిన ఇన్వెస్టిగేటర్ తేరిపార గమనించడంతో దొరికిపోయాడు. స్ధానిక పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బూప్ను అరెస్ట్ చేశారు. ఇంగ్లీష్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఆమెకు సాయపడేందుకే తాను ఈ సాహసం చేశానని దర్యాప్తులో నిందితుడు అంగీకరించాడు. మోసం, ఫోర్జరీ ఆరోపణలపై ప్రేమ జంటపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే వీరికి జరిమానా విధించడంతో పాటు ఐదేండ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

