PAN Card | పాన్ కార్డును ఉపయోగించుకొని ఈ తప్పులు చేశారంటే.. పది వేలు ఫైన్ కట్టాల్సిందే
PAN Card | ఉద్యోగులు అయితే ఖచ్చితంగా పాన్ కార్డును తీసుకోవాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పాన్ కార్డు అవసరం ఉంటుంది.
PAN Card | పాన్ కార్డు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. బ్యాంక్ ఖాతా తీయాలన్నా పాన్ కార్డు కావాల్సిందే. ఇండియన్స్‌కు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. పాన్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వరు. ఉద్యోగులు అయితే ఖచ్చితంగా పాన్ కార్డును తీసుకోవాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పాన్ కార్డు అవసరం ఉంటుంది.

అయితే.. కొందరు పాన్ కార్డును ఉపయోగించుకొని కొన్ని తప్పులు చేస్తుంటారు. కార్డును మిస్యూజ్ చేస్తుంటారు. అటువంటి వాళ్లు రూ.10 వేల ఫైన్ కట్టాల్సి వస్తుంది.
పాన్ కార్డు ద్వారా ఎవరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వద్ద మొత్తం డేటా ఉంటుంది. కొందరు రెండు పాన్ కార్డులు తీసుకొని మిస్ యూజ్ చేస్తుంటారు. రెండు పాన్ కార్డులు తీసుకోవడం అనేది చట్టరిత్యా నేరం. ఒకవేళ అధికారులకు రెండు పాన్ కార్డులతో దొరికితే రూ.10 వేలు ఫైన్ కట్టాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
బ్యాంక్ అకౌంట్లను కూడా అధికారులు ఫ్రీజ్ చేస్తారు. అయితే.. రెండు పాన్ కార్డులు ఉన్నవాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద సెక్షన్ 272బీ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దాన్ని తిరిగి ఇచ్చేయొచ్చు. అలా కాకుండా తమ దగ్గరే పెట్టుకుంటే మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటారు.
రెండు పాన్ కార్డులు ఉన్నవాళ్లు.. ఏదైనా ఎన్ఎస్డీఎల్ ఆఫీసులో పాన్ కార్డును రిటర్న్ చేయొచ్చు. దానికంటే ముందు పాన్ కార్డ్ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఓ ఫామ్ నింపాల్సి ఉంటుంది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

