ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి : బాల ఇందుర్తి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని శంకర నేత్రాల యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి కోరారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ.. ఇప్పటి వరకు బాల ఇందుర్తి 40కి పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారిని, సంస్థలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యూఎస్ఏ నుంచి విజ్జు చిలువేరు వ్యాఖ్యాతగా మార్చి 27న నిర్వహించిన జూమ్ మీటిగ్లో జాతీయ అవార్డు గ్రహీత ఉన్ని కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్ని కృష్ణన్ ఘంటసాల పాటల్లోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు. వాగ్గేయకారుడు అన్నమయ్య తరువాత కలియుగదైవం అయినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడే అరుదైన అవకాశాన్ని ఘంటసాల పొందారు అని కీర్తించారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని బాల ఇందుర్తి చేస్తున్న కృషిని అభినందించి, తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవాడ్డుకు ఎంపిక కాగా, అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం అన్నారు. అతిత్వరలోనే సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, కెనడా నుండి తెలుగు అలయన్స్ అఫ్ కెనడా అధ్యక్షులు కల్పన మోటూరి, హాంగ్ కాంగ్ నుండి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పీసపాటి, థాయిలాండ్ నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ థాయిలాండ్ అధ్యక్షులు రవికుమార్ బోబ్బా, బెహ్రెయిన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ యెల్లపు, ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, పారిస్ ఉపాధ్యక్షురాలు ఆన్నపూర్ణ మహేంద్ర తదితరులు పాల్గొని ఘంటసాల జీవించిన సమయంలో తామెవరు లేకపోయినా ఇప్పటికి వారి పాటలు తమ మదిలోనే ఉన్నాయని కొనియాడారు. వారు పరమపదించిన 48 సంవత్సరాల తరువాత కూడా ఘంటసాల పాటలను ఈనాటి తరం పిల్లలతో సహా అందరు పాడుకోవడం వారి పాటలలో అమరత్వం ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమన్నారు. ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అభ్యర్ధించారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరు సమిష్టిగా కృషి చేయాలని తీర్మానించారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులుతో పాటు, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 43 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేసి ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారందరిని సంఘటితం చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

