bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
obathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వర్యంలో ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ నగరంలో బతుకమ్మ , దసరా వేడుకలు నిర్వహించారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు.
bathukamma celebrations | ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ , దసరా వేడుకలు అత్యంత వైభవంగా , కన్నుల పండుగగా జరిగాయి. R.A Brown Middle School లో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు , చిన్నారి అమ్మాయిలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు.
మొదటి సారి పురుషులు, మహిళలు , పిల్లలు కోలాటం ఆట లో ఎంతో హుషారుగా పాల్గొన్న ఈ వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు అందరు గౌరమ్మ, ప్రసాదాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. దసరా ఉత్సవాన్ని షమీ స్తోత్రం అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ రుచికరమైన భోజనాన్ని వడ్డించారు.
ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల OTA టీం తరుపున బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పండుగలని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకలని అత్యంత అంగ రంగ వైభవవోపేతంగా జరిపి విజయవంతం అవటానికి కృషి చేసిన OTA టీం, వాలంటీర్స్ – సురేష్, శ్రీపాద్, భాస్కర్, రఘు ఎస్, శ్రీని జీ , అరుణ్, ప్రదీప్, అజయ్, శ్రీకాంత్, నవీన్, రఘు బి, జయ్, అభిరాం వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. చివరగా వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి OTA టీమ్ తరుపున అభినందనలు తెలిపారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

