KCR Cricket Cup | ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్..పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
KCR Cricket Cup | ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న కేసీఆర్ క్రికెట్ కప్(KCR Cricket Tournament) టోర్నమెంట్ పోస్టర్ను బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నిజామాబాద్లో ఆవిష్కరించారు.
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న కేసీఆర్ క్రికెట్ కప్(KCR Cricket Tournament) టోర్నమెంట్ పోస్టర్ను బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నిజామాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి(BRS) లక్ష్యాలను, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా టోర్నీని నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డిని ఆమె అభినందించారు.

టోర్నమెంట్ నిర్వహణ వల్ల సీఎం కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఎజెండా ను ఎన్ఆర్ఐలందరికీ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతీ గ్రామానికి స్టేడియం నిర్మించనున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని భారతీయులకు, ఎన్ఆర్ఐలకు తెలిసేలా క్రికెట్ టోర్నీని ఎంచుకున్నామని వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బాబా ఫసియుద్దిన్ ,సేనాపతి రాజు, కళ్లెం హరికృష్ణ రెడ్డి, రమేష్ చారి, బీ ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

