CM KCR | 2023లో మళ్లీ కేసీఆర్ సర్కారే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సౌతాఫ్రికా ఎన్నారై శాఖ
CM KCR | త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
CM KCR | త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించామని అలాగే ఈసారి కూడా అటు సోషల్ మీడియా, టెలీఫోనిక్ కాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యక్షంగా కొన్ని నియోజక వర్గాలలో పర్యటించి కేసీఆర్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దళితబంధు, రైతు సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు.
ఏ దిక్కులేని వారికి ఆసరాతో అండగా, పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో ఆర్థిక భరోసా కల్పించారని పేర్కొన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేలా గొర్రెలు, చేప పిల్లల పంపిణీ చేపట్టారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలను అమలుచేస్తూ ప్రజల నుంచి హర్షాతిరేకాలను పొందుతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయ కేతనం ఎగురవేస్తదని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికలలో ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొననున్న తమ కార్యవర్గ సభ్యుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు గుర్రాల నాగరాజు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

