ATA | తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్లో భారీ ఎత్తున ఆటా వేడుకలు
ATA | గత 20 ఏండ్లుగా ఆటా వేడుకల పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా నిర్వహిస్తుంది.
ATA | హైదరాబాద్ : గత 20 ఏండ్లుగా ఆటా వేడుకల పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాన్ని ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.
ఆటా సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింపజేస్తూ ఉన్నది. విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల సహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు డిసెంబర్ 12 నుంచి 27వ తేదీ వరకు జరగబోతున్నాయి.

డిసెంబర్ 12 – రంగారెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు
డిసెంబర్ 13 – సంగారెడ్డి ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్
డిసెంబర్ 14 – హైదరాబాద్‌లో సాహిత్య కార్యక్రమం
డిసెంబర్ 16 – 17: బిజినెస్ సెమినార్స్ – హైదరాబాద్, విశాఖపట్నం
డిసెంబర్ 20 – 23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాటర్ ప్లాంట్, ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.
డిసెంబర్ 24 – 25 : పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్, చారిటబుల్ ప్రోగ్రామ్స్
డిసెంబర్ 27 : గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతిలో – సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా అవార్డ్స్ ప్రధానం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 – ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | సస్పెన్స్‌కు ఫుల్స్టాప్.. చిరంజీవి ‘కాకా’ను రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

