TTD Tirumala BIRRD Recruitment 2023 | తిరుపతిలోని బర్డ్ ట్రస్ట్ దవాఖానలోని అనస్థీషియా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 09వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : అనస్థీషియా
అర్హతలు : ఎండీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి
వయస్సు : 42 ఏండ్లు మించకూడదు.
జీతం: రూ.1,01,500 నుంచి రూ.1,67,400 వరకు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, బర్డ్ ట్రస్ట్ దవాఖాన, టీటీడీ, తిరుపతి అడ్రస్‌కు పంపించాలి).
చివరి తేదీ: జూన్ 09
వెబ్సైట్ : https://www.tirumala.org/SABIRRD.aspx