NCB Recruitment | ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (Intelligence Officer Posts) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయాల్లో 68 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 68
పోస్టులు : ఇంటెలిజెన్స్ ఆఫీసర్
పని ప్రదేశం : చండీగఢ్, ఢిల్లీ, జోధ్పూర్, అమృత్సర్, డెహ్రాడూన్, లక్నో, శ్రీనగర్, ముంబై, గోవా,
బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, కొచ్చిన్ తదితరాలు.
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : సెప్టెంబర్ 15
వెబ్సైట్ : www.narcoticsindia.nic.in