ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 12 : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అడిషనల్ కలెక్టర్‌గా అంకిత్ నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చిత్రమిశ్రాను ఏటూరునాగారం ఇంటిగ్రెటేడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న అదే బ్యాచ్‌కు చెందిన అంకిత్‌ను నిజామాబాద్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్‌గా నియమించింది.