మోర్తాడ్, డిసెంబర్ 24: మోర్తాడ్ మండలం పెద్దవాగు పరిసరాల్లో ఆదివారం ఉదయం నుంచి పొగమంచు కప్పేసింది. గాండ్లపేట్ బ్రిడ్జివద్ద పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జాతీయరహదారిపై ముందర ఏముందో కనిపించని పరిస్థితి ఏర్పడడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. దొన్కల్ శివారు నుంచి గాండ్లపేట్ గ్రామం వరకు పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.