KCR Birthday | పోతంగల్, ఫిబ్రవరి 17: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాయకులు ఎంఏ హకీం, ఆరిఫ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు.
తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. కేసీఆర్ భగవంతుడి ఆశీర్వాదం తో నిండు నూరేళ్లు ఆయురోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో హన్మంతు, సురేష్ పటేల్, ఎజాజ్, పరుశురాం, గణేష్, బీరప్ప, సాగర్, ఫిరోజ్, రాజు, సద్దాం, ఖలీల్, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.