‘కంటివెలుగు’ను విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జడ్పీ సీఈవో గోవింద్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్‌దాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
- అధికారులకు జడ్పీ సీఈవో గోవింద్ ఆదేశం
- గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్ రూరల్/ కోటగిరి/ మోస్రా (చందూర్), జనవరి 13 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18న ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జడ్పీ సీఈవో గోవింద్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్‌దాస్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రూరల్ మండలంలోని మల్లారం, కొత్తపేట గ్రామాల్లో ముందుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో మధురిమ, సూపరింటెండెంట్ ప్రవీణ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వైద్యారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ..
మండలంలోని మల్లారంలో కంటివెలుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎంపీడీవో మల్లేశ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్ నగేశ్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కోటగిరి ఎంపీడీవో కార్యాలయంలో కంటివెలుగుపై వైద్యసిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్‌పటేల్ మాట్లాడుతూ.. కంటివెలుగుపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్‌రావు, ఇన్చార్జి ఎంపీడీవో మారుతి, హెల్త్ సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా శిబిరాలను ఏర్పాటుచేసేందుకు తహసీల్దార్ శ్రీకాంత్‌రావు, రమేశ్, ఆరోగ్యశాఖ అధికారులు పొతంగల్ రైతువేదికను పరిశీలించారు. కోటగిరిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో శిబిరాలు నిర్వహించన్నునట్లు హెల్త్‌సూపర్‌వైజర్ కృష్ణవేణి తెలిపారు.
చందూర్, మోస్రా మండలకేంద్రాల్లో రైతువేదికలో మోస్రా ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాములు, చందూర్ ఎంపీపీ లావణ్యరాంరెడ్డి అధ్యక్షతన కంటివెలుగుపై అవగాహన కల్పించారు. వైద్యాధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందేలా చూడాలని గ్రామస్థాయి అధికారులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఐకేపీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మోస్రా ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాములు, చందూర్ ఎంపీపీ లావణ్య రాంరెడ్డి, ఎంపీడీవోలు నీలావతి, భారతి, తహసీల్దార్ వసంత, ఎంపీడీవోలు తారాచంద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

