బలహీనంగా పుట్టిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
బలహీనంగా జన్మించిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్ పీడీ సుధారాణి అన్నారు.
- ఐసీడీఎస్ పీడీ సుధారాణి
కోటగిరి, డిసెంబర్ 29 : బలహీనంగా జన్మించిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్ పీడీ సుధారాణి అన్నారు. పొతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ అవరణలో రుద్రూర్, కోటగిరి, పొతంగల్ మండలాల అంగన్వాడీ టీచర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బలహీనంగా ఉన్న పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
బోధన్ ప్రాజెక్టు సీడీపీవో జానకమ్మ ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అప్రోచ్(ఐఎల్ఏ)పై అవగాహన కల్పించారు. 1.5 కిలోల బరువు ఉన్న శిశువు పుడితే శిశువును వెచ్చగా ఉంచాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో అరటి తోటలు పెంచాలన్నారు. సమావేశంలో సూపర్వైజర్లు శ్రీలత, సుమలత, మణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

