వేతన..వేదన
ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పంచాయతీ కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా నిత్యం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.
- మూడు నెలలుగా అందని జీతాలు
- ఆర్థిక ఇబ్బందుల్లో జీపీ కార్మికులు
- నిజామాబాద్ జిల్లాలో 2873 మంది కార్మికులు
- రూ.7.80కోట్లు బకాయిలు
- నిధులు విడుదల చేయాలని వేడుకోలు
కోటగిరి, జూన్ 20: ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పంచాయతీ కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా నిత్యం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు లేక ఇక్కట్లకు గురవుతున్నారు. అసలే చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పంచాయతీ కార్మికులు మూడు నెలలుగా మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2873 మంది కార్మికులు..
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయా జీపీల పరిధిలో మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో 2873 మందిని నియమించింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో విశేష కృషి చేస్తున్నారు. అసలే వానకాలం..వ్యాధులు ప్రబలే సమయంలో ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే పల్లెలు శుభ్రంగా ఉండాలి. ఇందులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. కానీ జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు కొన్నిచోట్ల ఆరు నెలలు,మరికొన్ని చోట్ల మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదు. దీంతో త్వరలో కార్మికులు నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్తే పల్లెలు మురికి కూపాలుగా మారే ప్రమాదం ఉన్నదని స్థానికులు అంటున్నారు. కార్మికుల వేతనాలు సకాలంలో విడుదల చేస్తే పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయని, దీంతో ప్రజలు సైతం ఆరోగ్యంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో రూ.7.80కోట్ల బకాయిలు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 2873 మంది పంచాయతీ కార్మికులుండగా.. వీరిలో ఒక్కొక్కరికి నెలకు రూ. 9500లు వేతనం చెల్లించాల్సి ఉంది. కొన్ని పంచాయతీల్లో నాలుగు, ఐదు నెలలు, మరికొన్ని పంచాయతీల్లో ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో జిల్లాలో రూ.7.80 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా అధికారులకు, మండల అధికారులు ఎంపీడీవో, ఎంపీవోలకు వినతిపత్రం అందజేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పంచాయతీ కార్మికులు వాపోతున్నారు.
బాకీ చేసి ఇల్లు గడుపుతున్నా…
గ్రామ పంచాయతీ నుంచి మూడు నెలల నుంచి జీతాలు రాలేదు.. సార్లకు ఎప్పుడు అడిగినా పైసలు లేవు అంటున్నారు. నెలనెలా జీతాలు ఇవ్వకుంటే ఎట్ల బతకాలె? ఇల్లు ఎట్ల గడవాలె? తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి ఇల్లు గడుపుతున్నాం. ఇట్ల ఎన్ని రోజులు గడపాలా.? గవర్నమెంట్‌కు తెల్వ దా? నెలనెలా జీతాలు ఇవ్వాలని. జీతాలు రాక చానా కష్టమవుతున్నది.
– సాయవ్వ, పంచాయతీ కార్మికురాలు,ఎత్తొండ
నిధులు విడుదల కాగానే జమచేస్తాం..
మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్మికులకు మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. కార్మికులకు రోజూ ఏదో ఒకటి నచ్చజెప్పి పనులు చేయిస్తున్నాం. వాళ్లకు జీతాలు రాక చాలా ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే వెంటనే వారి ఖాతాల్లో జమ అవుతాయి.
పస్తులు ఉండాల్సి వస్తున్నది..
సకాలంలో వేతనాలు అందకపోవడంతో మా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. మండల, జిల్లాస్థాయి అధికారులకు అనేకసార్లు వినతిపత్రం అందజేశాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు వేతనాలు అందేలా చూడాలి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

