Banswada | బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 24 : విషయ పరిజ్ఞానం కోసం క్షేత్రస్థాయి పర్యటన తప్పనిసరి అని కొత్తాబాది ఆదర్శ కళాశాల అధ్యాపకుడు సునీల్ అన్నారు. బాన్సువాడ మండలంలోని కొత్తాబాది ఆదర్శ కళాశాల ఒకేషనల్ విద్యార్థిని, విద్యార్థులు గురువారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులు, ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు వివరించారు.
ఒకేషనల్లో (ఎంపీహెచ్ఏ) రెండో సంవత్సం చదువుతున్న విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ లో రోగులకు అందే సేవలను ల్యాబ్ టెక్నిషీయన్లు శ్రీనివాస్, ఎబీనైజర్లు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు సునీల్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.