పేద విద్యార్థులకు కార్పొరేట్ వసతులు
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులను కల్పిస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
- లింగంపేటలో మైనారిటీ గురుకుల కళాశాల భవనం ప్రారంభం
లింగంపేట, డిసెంబర్ 28: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులను కల్పిస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మైనారిటీల సంక్షేమంలో భాగంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదువుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన మైనారిటీ గురుకుల కళాశాల భవనాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో 24 మైనారిటీ గురుకులాలు ఉండగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సకల సౌకర్యాలతో సీఎం కేసీఆర్ మొత్తం 204 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లతో సమయాన్ని వృథా చేసుకోకుండా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఎదగాలని సూచించారు. గత ఫలితాల్లో మండలంలోని మైనారిటీ గురుకులం రాష్ట్రంలోనే 4వ ర్యాంకు సాధించడంపై అభినందిస్తూ ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు రాబట్టాలని అధ్యాపకులకు సూచించారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలు క్రమశిక్షణకు నిలయాలని అన్నారు. ఉన్నతస్థాయిలో స్థిరపడినవారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలన్నారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటంతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకున్నది. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ షమీమున్నీసా బేగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ నాయక్, సొసైటీ చైర్మన్లు దేవేందర్‌రెడ్డి, రమేశ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి షేక్ సలాం, రీజినల్ కో-ఆర్డినేటర్ అబ్దుల్ బషీర్, విజిలెన్స్ టీం సభ్యులు జియా అహ్మద్, హమీద్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రాములు, మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి శశికాంత్, నాయకులు నయీం, శ్రీకాంత్, సాయిలు, సిద్ధ్దారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
Jailer 2 OTT | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

