Heart Attack | కానిస్టేబుల్ కూరపాటి రఘు గుండెపోటుతో మృతి
గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కూరపాటి రఘు (44) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు.
Heart Attack | గాంధారి, జూన్ 9 : గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కూరపాటి రఘు (44) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం రాత్రి విధులు నిర్వహించిన రఘు మంగళవారం రోజు ఉదయం విధుల కోసం బాన్సువాడ నుండి గాంధారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకొని కుప్పకూలిపోయారని అతని బంధువులు తెలిపారు.
గమనించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రఘు ఆకస్మిక మరణంతో గాంధారి పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణ లో నిబద్ధతతో పనిచేసిన ఆయన మరణం పట్ల సహుద్యోగులు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతికాయాన్ని తన స్వగృహానికి బాన్సువాడకి తరలించారు. గాంధారి సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

