హైదరాబాద్: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సింగరేణి (Singareni) కోల్ మైన్స్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈనెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మొత్తం 45 పోస్టులను భర్తీచేస్తున్నది. దీనికోసం ఈనెల 21 నుంచి 23 వరకు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది.
మొత్తం పోస్టులు: 45
ఇందులో జనరల్ సర్జన్ 5, ఆర్థో సర్జన్ 5, ఈఎన్టీ సర్జన్ 2, ఆప్టల్మాలజిస్ట్ 3, గైనకాలజిస్ట్ 7, ఫిజీషియన్ 4, రేడియాలజిస్ట్ 2, పాథాలజిస్ట్ 1, హెల్త్ ఆఫీసర్ 4, అనెస్థెటిస్ట్ 6, పిడియాట్రిషియన్ 3, సైకియాట్రిస్ట్ 1, చెస్ట్ ఫిజీషియన్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ చేసి, 45 ఏండ్లు పైబడినవారై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 8
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 17
ఇంటర్వ్యూ: ఏప్రిల్ 21-23
వెబ్సైట్: www.scclmines.com