NLC Recruitment 2024 | మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్, ఎస్ఎంఈ అండ్ టెక్నికల్ విభాగాలలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటీఐ, సంబంధిత ట్రేడ్లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 239
పోస్టులు : ఇండస్ట్రియల్ ట్రైనీ
విభాగాలు : మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్, ఎస్ఎంఈ అండ్ టెక్నికల్
అర్హతలు : పదో తరగతితో పాటు ఐటీఐ, సంబంధిత ట్రేడ్లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : యూఆర్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 37 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులు 40 ఏళ్లు, ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్: పోస్టులను బట్టి రూ.14000 నుంచి రూ.22000 వరకు
వెబ్సైట్ : www.nlcindia.in
దరఖాస్తు ప్రారంభం : మార్చి 20
దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 19