న్యూఢిల్లీ: కోల్కతాలోని సీఎస్ఐఆర్-సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీజీసీఆర్ఐ)లో ఖాళీగా ఉన్న జేఆర్ఎఫ్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 11 వరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా జూనియర్ రిసెర్చ్ ఫెలోలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 5
ఇందులో జనరల్ 2, ఓసీ-పీహెచ్సీ 1, ఎస్సీ 1, ఓబీసీ 1
అర్హత: సిరామిక్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ లేదా గ్లాస్ టెక్నాలజీ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు ఉండాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపు ఉన్నవారై ఉండాలి.
స్టయిఫండ్: ప్రతి నెల రూ.31,000
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ (coordinator.cgcri@acsir.res.in )ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ ఒకటి నుంచి ఏడు వరకు పంపించవచ్చు
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 11
వెబ్సైట్: www.cgcri.res.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి