EAPCET లో ఆశించిన ర్యాంకు రాలేదా ? భవిష్యత్తుకు కొత్త దారి చూపుతున్న BS కంప్యూటర్ సైన్స్!
EAPCET | సాంకేతిక ప్రపంచంలో సంప్రదాయ డిగ్రీలతో పాటు కొత్త తరహా కోర్సులు కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా UGC ప్రవేశపెట్టిన Apprenticeship Embedded Degree Program (AEDP) కింద అందిస్తున్న BS Computer Science కోర్సులు విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు, పరిశ్రమ అనుభవం కల్పించే దిశగా రూపొందించబడ్డాయి.
EAPCET | ఇంటర్మీడియట్ పూర్తయింది. EAPCET ఫలితాలు కూడా వచ్చాయి. కొందరు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధిస్తుంటే, మరికొందరు ఆశించిన ర్యాంకు రాక ఆందోళన చెందుతున్నారు. “ఇప్పుడు ఏం చేయాలి?”, “ఇంజినీరింగ్ కాకపోతే భవిష్యత్తు లేదా?” అనే ప్రశ్నలు విద్యార్థులు, తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. అయితే మారుతున్న సాంకేతిక ప్రపంచంలో సంప్రదాయ డిగ్రీలతో పాటు కొత్త తరహా కోర్సులు కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా UGC ప్రవేశపెట్టిన Apprenticeship Embedded Degree Program (AEDP) కింద అందిస్తున్న BS Computer Science కోర్సులు విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు, పరిశ్రమ అనుభవం కల్పించే దిశగా రూపొందించబడ్డాయి.
ఉద్యోగాల మార్కెట్ మారుతోంది
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. కానీ పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలు అందరిలో ఉండడం లేదు. పరిశ్రమ అవసరాలు, విద్యా విధానం మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు స్కిల్-ఇంటిగ్రేటెడ్ కోర్సులపై దృష్టి పెరుగుతోంది. UGC కూడా ఈ దిశగా AEDP వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలు కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతోంది. కేవలం సిలబస్ ఆధారిత విద్య కాకుండా, పరిశ్రమలో పని చేస్తూ నేర్చుకునే విధానం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది.
ఈ కోర్సు ప్రత్యేకత ఏంటి?
ఈ కోర్సు ప్రత్యేకత ఏమిటంటే నాలుగేళ్ల వ్యవధిలో మొదటి రెండు సంవత్సరాలు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ నేర్పిస్తారు. తరువాతి రెండు సంవత్సరాలు పరిశ్రమలతో అనుసంధానమైన అప్రెంటిస్షిప్, ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. TalentSprint (Accenture భాగస్వామ్యం) వంటి పరిశ్రమ భాగస్వాములతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.
బీటెక్కు ప్రత్యామ్నాయమా?
సంప్రదాయ బీటెక్ కోర్సులు గణితంపై ఎక్కువ దృష్టి పెడతాయి. BS Computer Science కోర్సు మాత్రం ప్రాక్టికల్ నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలు, ప్రాక్టికల్ శిక్షణపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. MPCతో పాటు BiPC, MEC, CEC విద్యార్థులు కూడా ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. AI, Data Science, Cyber Security వంటి రంగాల్లో కెరీర్ కోరుకునే వారు ఈ కోర్సును ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న BS కోర్సుల ప్రాధాన్యం
ఇటీవలి కాలంలో IITలు, IISc, IISERలు, ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా BS డిగ్రీలను ప్రవేశపెడుతున్నాయి. డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, పరిశోధన రంగాలకు అనుగుణంగా ఈ కోర్సులు రూపుదిద్దుకుంటున్నాయి.
విద్యార్థులు కేవలం డిగ్రీ పొందడం కాకుండా, ఉద్యోగ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలను కూడా సంపాదించాలని పరిశ్రమలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలతో అనుసంధానమైన BS ప్రోగ్రామ్లు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
స్కిల్ ఉన్నవారిదే భవిష్యత్
ఈఎంసెట్ ర్యాంకు మాత్రమే విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించదని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు. కోర్సు నాణ్యత, పరిశ్రమ అనుసంధానం, నైపుణ్యాల అభివృద్ధి, ఇంటర్న్షిప్ అవకాశాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. విద్యా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే దశాబ్దంలో కేవలం డిగ్రీ కంటే స్కిల్ + అనుభవం కలిగిన విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి. అందుకే సంప్రదాయ మార్గాలతో పాటు కొత్త తరహా కోర్సులను కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
BS Computer Science కోర్సు ముఖ్యాంశాలు
4 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రామ్
ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధం
2 సంవత్సరాలు క్యాంపస్ లెర్నింగ్
2 సంవత్సరాలు ఇండస్ట్రీ అప్రెంటిస్షిప్
AI & Machine Learning
Cyber Security
Full Stack Development
Data Science
Cloud Computing
MPC, BiPC, MEC, CEC విద్యార్థులకు అవకాశం
ఉద్యోగ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం హైదరాబాద్లోని విశ్వ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ (VVISM) ఇటీవల BS Computer Science (Apprenticeship Embedded Degree Program )ను ప్రారంభించింది. ఈ కోర్సు ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధంతో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్(9281416210 )ను సంప్రదించండి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

