Central Bank of India Recruitment 2024 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 300 (తెలంగాణలో- 96, ఏపీలో 100 ఖాళీలు ఉన్నాయి.)
పోస్టులు : అప్రెంటిస్
అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయసు : 2024 మార్చి 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.800
శిక్షణ కాలం : ఏడాది
స్టైపెండ్ : రూ.15,000
దరఖాస్తులకు చివరితేదీ : మార్చి 6
పరీక్ష తేదీ : మార్చి 10
వెబ్సైట్ : https://nats.education.gov.in/