బ్యాంక్ నోట్ ప్రెస్లో 81 జూనియర్ టెక్నీషియన్ల భర్తీకి నోటిఫికేషన్
Bank Note Press | బ్యాంక్ నోట్ ప్రెస్లో (Bank Note Press) ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు
న్యూఢిల్లీ: బ్యాంక్ నోట్ ప్రెస్లో (Bank Note Press) ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 28 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఉద్యోగాలు ఇంక్ ఫ్యాక్టరీ, ప్రింటింగ్, ఎలక్ట్రికల్ లేదా ఐటీ విభాగాల్లో ఉన్నాయి. ఎంపికైనవారు మధ్యప్రదేశ్లోని దేవాస్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 81
అర్హతలు: ఐటీఐలో డిప్యూటీ టెక్నాలజీ, పెయింట్ టెక్నాలజీ, పర్ఫేస్ కోటింట్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లిథో ఆఫ్సెట్ మెషిన్ మైండర్, లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ఎలక్ట్రో ప్లాటింగ్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
రాతపరీక్ష : మొత్తం125 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 120 నిముషాల పాటు పరీక్ష రాయవల్సి ఉంటుంది. టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్ధులకు రూ.200.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
ఆన్లైన్ రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2022
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 28
వెబ్సైట్: bnpdewas.spmcil.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

