AP EAPCET 2025 Results | ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థి.. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌కు తొలి ర్యాంకు
AP EAPCET 2025 Results | ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సత్తా చాటాడు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్ రెడ్డి తొలి ర్యాంకు సాధించాడు. ఇక శ్రీకాళహస్తి విద్యార్థి భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంక్ సాధించారు.
AP EAPCET 2025 Results | ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సత్తా చాటాడు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్ రెడ్డి తొలి ర్యాంకు సాధించాడు. ఇక శ్రీకాళహస్తి విద్యార్థి భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంక్ సాధించారు. నంద్యాల జిల్లా విద్యార్థి రామ్‌చరణ్ రెడ్డికి నాలుగో ర్యాంకు, అనంతపురం విద్యార్థి నితిన్‌కు ఐదో ర్యాంకు వచ్చాయి.
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఆచార్య సీఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. కాగా ఈ పరీక్షల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

