ఆనంద్ వర్థన్, దివి, అర్జున్, స్నేహాల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆన్ ది వే’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో దర్శకుడు హరి పెయ్యల రూపొందిస్తున్నారు. ఎస్ఎస్ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఏ శివ హరీష్, ఏ జయంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్ లోగోను యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సినిమా చిత్రీకరణ అంతా హైదరాబాద్ రోడ్ల మీద జరిపామని, క్రైమ్ కామెడీ చిత్రంగా ఆకట్టుకుంటుందని’ దర్శకుడు తెలిపారు.