లండన్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సాంగ్ లండన్ తుమక్ధాకు లండన్‌లో బిగ్ బెన్ ఎదుట ఓ యువతి అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో (Viral Video) ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో యువతి ఐకానిక్ బిల్డింగ్ ఎదుట కంగనా సాంగ్‌కు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఆమె క్రేజీ పెర్ఫామెన్స్ పలువురు నెటిజన్లను ఆకట్టుకోగా మరికొందరు పెదవివిరిచారు.
ఈ వీడియోను యూబీ1యూబీ2 ఇన్స్టాగ్రాం ఖాతా షేర్ చేయగా ఇప్పటివరకూ 6 లక్షల మందిపైగా వీక్షించారు. లండన్ తుమక్ధ సాంగ్‌కు బిగ్ బెన్ ఎదుట యువతి కిల్లర్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది. యువతి డ్యాన్స్‌ను అక్కడున్న వారంతా ప్రశంసిస్తూ చప్పట్లతో ప్రోత్సహించారు.
పేవ్‌మెంట్‌పై స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో యువతి సత్తా చాటింది. యువతి డ్యాన్స్ పెర్ఫామెన్స్ తమను ఆకట్టుకుందని పలువురు యూజర్లు కామెంట్ చేయగా, ఇలాంటివి ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయని, దీనికి బదులు లండన్‌లో మెరుగైన సమాచారం అందించే ట్రావెల్ రీల్స్ చేయాలని మరికొందరు సూచించారు.
Read More