న్యూఢిల్లీ: రాఖీ పండుగ నేపథ్యంలో ఓ జ్వలరీ బ్రాండ్ వాణిజ్య ప్రకటనను రిలీజ్ చేసింది నటి కృతి సనన్(Kriti Sanon). ఆ బాలీవుడ్ హీరోయిన్ నటించిన యాడ్ వివాదాస్పదమైంది. బికినీ దుస్తుల్లో సోదరుడికి రాఖీ కట్టాల్సిన అవసరం ఏంటి అని ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నటి కృతి సనన్ మౌనం వీడారు. ఆన్లైన్ ట్రోలింగ్‌పై ఆమె రియాక్ట్ అయ్యారు. శతాబ్ధాలుగా స్త్రీలు ధరించే దుస్తుల్లో మార్పులు జరిగాయని, కానీ మహిళకు గౌరవం అనేది ఆమె వేసుకునే దుస్తులపై ఇంకా ఆధారపడుతోందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం అనేది గుండెల్లో ఉంటాయని, నెక్‌లైన్‌లో కాదని కీర్తి అన్నారు. ఆడవాళ్లు ఏ దుస్తులు వేసుకోవాలో చెప్పడం ఇంకెప్పుడు ఆపేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కృతి తాజాగా ఈ టాపిక్‌పై స్పందించారు.
జ్వలరీ యాడ్ కోసం కృతి వేసుకున్న దుస్తులు కావాలని రెచ్చగొట్టే రీతిలో ఉన్నట్లు ఎంపీ కంగనా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సనన్ కౌంటర్ ఇస్తూ.. పండుగల్లోని ఆంతర్యం దుస్తులు ధరించడంలో లేదని, కానీ భావోద్వేగాలు, సంప్రదాయాల్లో ఆ మర్మం ఉంటుందన్నారు. రక్షాబంధనం అనేది ఓ రక్షణ బంధం అని, మా చెల్లిలి, నేను కూడా రాఖీ కట్టుకుంటామని, సోదరుడు లేకున్నా తమను తాము రక్షించుకుంటామన్న సంకేతం ఇస్తుందని, ఇద్దరం ఒకరి సంతోషం, ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తామని, ఇది ప్రతి ఫ్యామిలీలో ఉంటుందని కృతి అన్నారు.
సోదరుడికి రాఖీ కట్టేందుకు కృతి ప్రయత్నిస్తున్న సమయంలో పెంపుడు కుక్క వారిని చూస్తుంది, ఆ సమయంలో ఓ పెట్ డాగ్‌కు ఓ రాఖీ కట్టి, సోదరుడికి మరో రాఖీ కడుతుంది. ఈ యాడ్‌లో కృతి సనన్ వేసుకున్న దుస్తులో చూపరులను రెచ్చగొట్టే రీతిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుక్కకు రాఖీ కట్టడం ఏంటిని కూడా కొందరు విమర్శిస్తున్నారు.
I just saw an entire thread on Kriti Sanon’s CLOTHES in a Rakhi Ad.
CLOTHES. YUP. You read that right.
And A RAKHI AD!Rakhi, a festival literally to celebrate the relationship between a brother and a sister (discussions about the patriarchal ramifications of the same…
— Dr.Medusa (@ms_medusssa) August 24, 2026