వీడియోకాన్ టేకోవర్‌కు బ్రేక్

అనిల్ అగర్వాల్ బిడ్ రద్దు
న్యూఢిల్లీ, జనవరి 5: ఖాయిలా పడిన వీడియోకాన్‌ను కొనుగోలు చేసేందుకు వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ గెలుచుకున్న బిడ్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఏఎల్‌టీ) రద్దు చేసింది. కొత్తగా మళ్లీ బిడ్స్‌ను ఆహ్వానించాలని రుణదాతల్ని ఆదేశించింది. వివరాలివి… వీడియోకాన్‌ను టేకోవర్ చేసేందుకు అనిల్ అగర్వాల్‌కు చెందిన ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వేసిన రూ.2,962 కోట్ల బిడ్ ఆఫర్‌ను గతేడాది జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ అనుమతించింది. వీడియోకాన్‌కు రుణాలిచ్చిన మెజారిటీ రుణదాతలు ట్విన్‌స్టార్ ఆఫర్‌కు అంగీకారం తెలపడంతో అప్పట్లో ఈ టేకోవర్‌కు ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. అయితే కొంతమంది రుణదాతలు (బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐలు) ఈ బిడ్‌ను వ్యతిరేకిస్తూ ఎన్సీఏఎల్టీని ఆశ్రయించగా, బుధవారం ట్విన్‌స్టార్ బిడ్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసింది. ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషిన్లు తదితర వినియోగ వస్తువులు ఉత్పత్తి చేసే వీడియోకాన్..రుణదాతలకు రూ. 64,637 కోట్ల బకాయిపడింది. ఈ దివాళా కంపెనీకి ట్విన్‌స్టార్ ఇచ్చిన ఆఫర్ చాలా తక్కువని, రూ.62,000 కోట్ల హెయిర్‌కట్‌ను తీసుకోవాల్సి వస్తున్నదన్న కారణంతో బిడ్ రద్దు కోరుతూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐలు అప్పీలు చేశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

