కొడుకు సేకరించిన బూతు వీడియోలను డిలీట్ చేసిన పేరెంట్స్.. రూ.22 లక్షల జరిమానా విధించిన కోర్టు..!
USA court verdict: అశ్లీల వీడియోలకు బానిసగా మారిన తమ కొడుకు జీవితాన్ని చక్కదిద్దడం కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం వారి కొంప ముంచింది. కోర్టు ఆదేశాల మేరకు వాళ్లు తమ కొడుక్కు ఏకంగా రూ.22 లక్షలు

న్యూయార్క్: అశ్లీల వీడియోలకు బానిసగా మారిన తమ కొడుకు జీవితాన్ని చక్కదిద్దడం కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం వారి కొంప ముంచింది. కోర్టు ఆదేశాల మేరకు వాళ్లు తమ కొడుక్కు ఏకంగా రూ.22 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకూ కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తల్లిదండ్రులు ఏం చేశారు..? కోర్టు వాళ్లను నష్టపరిహారం చెల్లించాలని ఎందుకు ఆదేశించిందో క్లారిటీగా తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే…
ఇండియానా రాష్ట్రానికి చెందిన డేవిడ్ వెర్కింగ్ (43) అశ్లీల వీడియోలకు బానిసగా మారాడు. పొద్దస్తమానం బూతు వీడియోలు చూడటమే పనిగా పెట్టుకున్నాడు. అంతేగాకుండా డిఫరెంట్ బూతు వీడియోలు సేకరించేందుకు భారీగా ఖర్చు చేశాడు. అనేక వెబ్సైట్లలోని కొత్తకొత్త అశ్లీల వీడియోలను సేకరించాడు. అశ్లీల వీడియోల కోసం ఏకంగా 29 వేల డాలర్లు (దాదాపు రూ.21 లక్షలు) ఖర్చు చేశాడు. అయితే ఆ వీడియోలను తన తల్లిదండ్రులు నాశనం చేశారని డేవిడ్ వెర్కింగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్డ్ పాల్ మలోని పిటిషనర్ డేవిడ్ వెర్కింగ్కు అనుకూలంగా తీర్పునిచ్చారు. డేవిడ్ వెర్కింగ్ తన సొమ్మును నష్టపోయాడనడంలో ఎలాంటి సందేహాం లేదని, అతడు నష్టపోయిన మొత్తాన్ని పరిహారంగా పొందే హక్కు ఉందని జడ్జి వ్యాఖ్యానించారు. అయితే నాశనం అయిన అశ్లీల వీడియోల విలువ ఇంత అని సూచించే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాలని డేవిడ్ వెర్కింగ్కు న్యాయమూర్తి పాల్ మలోని ఆదేశాలు జారీచేశారు.
ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారిన కోర్టు తీర్పు..
డేవిడ్ వెర్కింగ్ సేకరించిన అశ్లీల వీడియోల కలెక్షన్‌ను నాశనం చేసినందుకుగాను తల్లిదండ్రులు అతనికి 30,441 అమెరికన్ డాలర్లు (రూ.22.37 లక్షలు) చెల్లించాల్సిందిగా జడ్జి పాల్ మలోని ఆదేశించారు. ప్రస్తుతం ఈ తీర్పు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి డేవిడ్ వెర్కింగ్ అశ్లీల వీడియోలను తల్లిదండ్రులు ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందంటే.. అతను గత కొంతకాలంగా ఆ వీడియోలకు బానిసగా మారాడు. దాంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుంది.
దాంతో ఒంటరి వాడిగా మిగిలిన డేవిడ్ వెర్కింగ్.. తల్లిదండ్రులు నివాసం ఉండే మిచిగాన్కు వెళ్లాడు. కొడుకు పరిస్థితి చూసిన తల్లిదండ్రులు అతడిని ఎలాగైనా అశ్లీల వీడియోలకు దూరం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే డేవిడ్ సేకరించిన మొత్తం అశ్లీల వీడియోలను అతను ఇంట్లో లేని సమయం చూసి డిలీట్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న డేవిడ్.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. అనంతరం నష్టపరిహారం కోసం కోర్టులో దావా వేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

