మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్

లక్నో: మనదేశంలో ఇప్పుడు ప్రధానంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటి తయారీ విధానం వేరే. రెండింటిని కలిపి ఇస్తే ఏమవుతుందో అనే విషయంలో స్పష్టత లేదు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈలోగా యూపీలో అనుకోకుండా మిక్సింగ్ జరిగిపోయింది. సిద్ధార్ధనగర్ జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్ 1న మొదటి డోసు కింద కోవిషీల్డ్ ఇచ్చారు. మే 14న రెండో డోసు కోసం వెళ్తే కోవాగ్జిన్ పొడిచారు. సుమారు 20 మందికి ఇలా జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి సమస్యలూ రాలేదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ఇది పొరపాటున జరిగింది. రెండు రకాల టీకాలు కలిపి ఇవ్వమని ఎలాంటి ఆదేశాలు లేవు. ఎంక్వైరీ జరిపి రిపోర్చు తెప్పించాం. బాధ్యుల నుంచి వివరణ కోరాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం అని సిద్ధార్థనగర్ జిల్లా వైద్యాధికారి సందీప్ చౌదరి చెప్పారు. మిశ్రమ టీకాలు తీసుకున్న గ్రామస్థులను కలిసి వాకబు చేశామని కూడా ఆయన చెప్పారు. కానీ ఓ గ్రామస్థుడు మాత్రం తమను ఎవరూ కలవలేదని తెలిపారు. “నాకు ఆందోళనగానూ, భయంగానూ ఉంది. రెండో డోసు కోసం పోతే చూసుకోకుండా వేరే టీకా ఇచ్చారు. అధికారులు ఎవరూ వచ్చి చూసిన పాపాన పోలేదు” అని రామూ సూరత్ అనే గ్రామస్థుడు చెప్పారు. ఈ 20 మంది ఇంతకూ టీకా తీసుకున్నట్టా లేక తీసుకోనట్టా? అంటే వారికి కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్లో టీకాల కార్యక్రమం అసలే నత్తనడకన నడుస్తున్నది. మరోవైపు ఇలాంటి పొరపాట్లు, గ్రహపాట్లు జరుగుతున్నాయి. యూపీలోని 23 కోట్ల జనాభాలో ఇప్పటివరకు 33 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. జాతీయ సగటు 3 శాతంగానూ, గుజరాత్, కేరళ రాష్ట్రాల సగటు 6 శాతంగానూ ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

