Union Bank | యూనియన్ బ్యాంక్లో 395 ఖాళీలు
Union Bank | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గల తన శాఖల్లో ఖాళీగా ఉన్న 395 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Union Bank | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గల తన శాఖల్లో ఖాళీగా ఉన్న 395 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డీజీఎం పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
అర్హతలు
పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంటెక్, ఎమ్మెస్సీతో పాటు బ్యాంకింగ్లో పని అనుభవం ఉండాలి. పోస్టులను బట్టి 22 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ఈ పోస్టులకు అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి పోస్టును బట్టి నెలకు రూ. 64,820 నుంచి రూ. 1,56,500 వరకు జీతం ఉంటుంది.
జూలై 21 నుంచి ప్రారంభమయ్యే దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీలోగా చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ https://www.unionbankofindia.bank.inలో చూడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

