వాషింగ్టన్, మే 15: గుర్తించబడని ఎగిరే వస్తువులు (యూఎఫ్వో) లేదా ఎగిరే పళ్లాలపై గత 50 ఏండ్లలో తొలిసారి అమెరికా కాంగ్రెస్ మంగళవారం బహిరంగ విచారణ జరుపనున్నది. యూఎఫ్వోలపై గత జూన్లో ఒక నివేదిక ప్రచురితమైన నేపథ్యంలో తీవ్రవాద వ్యతిరేక హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, కౌంటర్ప్రొలిఫెరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ జరుగనున్నది. ఆకాశంలో ఎగిరే వస్తువుల కారణంగా అమెరికా ప్రజల భద్రతకు, దేశానికి ముప్పు పొంచి ఉన్నందున యూఎస్ హౌస్ బహిరంగ విచారణ చేపట్టనున్నది. యూఎఫ్వోలపై చివరి బహిరంగ విచారణ 1970 ప్రారంభంలో జరిగింది.