Vaccine For Children | కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి.. త్వరలో డీసీజీఐకి నివేదిక
Vaccine For Children | కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి.. త్వరలో డీసీజీఐకి నివేదిక | 18 సంవత్సరాల్లోపు పిల్లలకు త్వరలోనే మరో టీకా అందుబాటులోకి రానున్నది. కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ను

హైదరాబాద్ : 18 సంవత్సరాల్లోపు పిల్లలకు త్వరలోనే మరో టీకా అందుబాటులోకి రానున్నది. కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ప్రయోగాలకు సంబంధించిన డేటాను వచ్చే వారంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. పీడియాట్రిక్ కొవాగ్జిన్ రెండు, మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నారు. వెయ్యి మంది చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పారు.
ప్రస్తుతం డేటాపై అధ్యయనం కొనసాగుతుందని, వచ్చే వారం నివేదికను డీసీజీఐకి అప్పగించే అవకాశం ఉందన్నారు. అలాగే ఇంట్రానసల్ వ్యాక్సిన్ ట్రయల్స్ సైతం రెండో దశలో ఉన్నాయని తెలిపారు. అక్టోబర్లో పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ముక్కు ద్వారా ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న వైరస్ను నాశనం చేస్తుందని తెలిపారు. టీకాను 650 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉందని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అవసరాన్ని తీర్చడమే మా ప్రయత్నం అని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

