Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలపై కేంద్రం కీలక నిర్ణయం..
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వాహనాల అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డీఎల్, ఆర్సీ డాక్యుమెంట్ల

న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వాహనాల అనుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డీఎల్, ఆర్సీ డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువును పొడిగించేందుకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఇకపై గడువు పొడిగింపు ఉండదని, ఈ నెలాఖరులో (అక్టోబర్ 31) వరకు సమయం ఇచ్చింది.
కరోనా మహమ్మారి సమయంలో ఆర్టీవో కార్యాలయాల్లో రద్దీని తగ్గించి, కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా పలు ముఖ్యమైన పత్రాల రెన్యువల్ గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సడలింపును ఎత్తివేయాలని నిర్ణయించిన కేంద్రం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు తర్వాత సంబంధిత డాక్యుమెంట్లలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేసింది.
ఎనిమిది సార్లు పొడగింపు

గతేడాది ఫిబ్రవరి 1న ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును కేంద్రం పొడగిస్తూ వచ్చింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో గడువు ముగిసిన అనంతరం చట్టవిరుద్ధంగా పరిగణించనున్నారు. కరోనా కాలంలో కేంద్రం ఇప్పటి వరకు ఎనిమిది సార్లు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ తదితర పత్రాల వ్యాలిడిటీని పొడిగిస్తూ వచ్చింది.
ఇందుకు మోటార్ వాహనాల చట్టం, 1988 అండ్ సెంట్రల్ మోటార్ సమయంలో, మోటార్ వాహనాల చట్టం, 1988 మరియు సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలతో పాటు సంబంధిత పత్రాల చెల్లుబాటు కోసం నిబంధనలు సడలించింది. తొలిసారిగా గతేడాది మార్చి 30 వరకు సడలింపు ఇవ్వగా.. ఆ తర్వాత.. జూన్ 9, 2020 వరకు, మళ్లీ ఆగస్టు 24 వరకు, అనంతరం డిసెంబర్ 27వరకు పొడిగించింది. మళ్లీ మార్చి 26 వరకు, అనంతరం ఈ ఏడాది జూన్ 17 వరకు.. మళ్లీ సెప్టెంబర్ 30వరకు, చివరిసారిగా అక్టోబర్ 31 వరకు పొడగించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

