టిల్లు పక్కా తెలంగాణ
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కొత్త చిత్రం ‘డిజె టిల్లు’. నేహా శెట్టి నాయికగా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ, ఫార్చూన్ ఫోర్ మూవీస్ తో కలిసి నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకుడు. సినిమా ఈ నెల 12న విడుదల ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజా ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు .
ఇప్పటిదాకా మీకు రాని గుర్తింపు ఒక్క ‘డిజె టిల్లు’ట్రైలర్ తో వచ్చిందంటున్నారు ట్రైలర్ తయారు చేసినప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఊహించాను. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి పేరొచ్చింది. సినిమాకు కూడా ఇదే స్పందన ఆశిస్తున్నాను.
టిల్లు పాత్ర ప్రత్యేకత ఏమిటి
టిల్లు పక్కా తెలంగాణ కుర్రాడు. వేడుకల్లో డీజె పాటలు చేస్తుంటాడు. ఇంటర్నెట్ వాడకం ఎక్కువ. ఆస్ట్రేలియాలో ఏ ఫ్యాషన్ ట్రెండింగ్ లో ఉంది, సెలబ్రిటీల జీవితం ఎట్లా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటాడు. రన్వీర్ సింగ్కు నాజల్ డీవియేషన్ (ముక్కు ఎముక వంకర) సంగతి కూడా చెబుతుంటాడు. చూసిన వాళ్లకు పెద్ద తోపులా అనిపిస్తాడు.
డిజె టిల్లు పాత్రకు స్ఫూర్తి మీరేనా
నేను పెరిగింది మల్కాజ్గిరి ప్రాంతంలో. అక్కడ యువత తీరే వేరు. వాళ్లకు రోజంతా స్నేహితులతో తీరిక రాత్రి డిజెలతో ఖుషీ చేసుకుంటారు. ఇలాంటి వ్యక్తులను చూసి డిజె టిల్లు పాత్రను రాసుకున్నాను. నాలోనూ కొంత డీజె టిల్లు ఉన్నాడు. టిల్లు దుస్తులు, హెయిర్ ైస్టెల్ విషయంలో కొత్త కొత్త ప్యాషన్ లను అనుసరిస్తుంటాడు.
పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడినట్లున్నారు
అవును, టిల్లు తెలంగాణ యాసలో పక్కా సికింద్రాబాద్ కుర్రాడిలా మాట్లాడుతాడు. అతనికి ఎమోషన్ ఎక్కువైనప్పుడు వరంగల్ యాస కూడా వచ్చేస్తుంది. మనం డెక్కన్ సినిమాలు చూస్తుంటాం కదా ఆ తరహాలో టిల్లు వ్యవహరిస్తాడు.
ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం ఆశించవచ్చు
ఈ సినిమాలో ప్రేమకథతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలుంటాయి. కథానాయకుడి కోణంలో సినిమా సాగుతుంది. నాయికకు ప్రాధాన్యత ఉంటుంది. వినోదత్మకంగా ఉండే ఈ చిత్రంలో ఒక మంచి విషయం కూడా చెబుతున్నాం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- DJ Tillu Movie
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

