న్యూఢిల్లీ, డిసెంబర్ 5: సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా కరగని మంచును తయారు చేశారు కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు. కరగకపోవడమే కాకుండా మళ్లీ మళ్లీ వినియోగించే వీలు ఉండటం ఈ ఐస్ క్యూబ్లకు ఉన్న మరో ప్రత్యేకత. ఆహార పదార్థాల రవాణాలో ఎక్కువగా ఐస్‌ను వాడతారు. ఐస్ కరిగిపోవడం వల్ల అవి కల్తీ అయ్యే ప్రమాదం ఉంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఐస్ క్యూబ్లతో ఆ ఇబ్బంది లేదు. ఇవి కరగవు. ఈ ఐస్ క్యూబ్‌ల తయారీ కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఒక జెల్లీ లాంటి పదార్థాన్ని తయారు చేశారు. దానికి నీళ్లను కలిపి ఐస్ క్యూబ్‌లను తయారు చేశారు. ఈ జెల్లీని ఫ్రిజ్‌లో పెడితే ఐస్ తయారు అవుతుంది. ఇది 13 గంటల వరకు చల్లగా ఉంటుంది. తర్వాత జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీని మళ్లీ ఫ్రిజ్‌లో పెడితే ఐస్ క్యూబ్ అవుతుంది. ఇలా ఎన్ని సాైర్లెనా వినియోగించవచ్చు.