ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ అంటూ మృగరాజు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాడిన పాట గుర్తుందా..? ఇప్పడు నగరంలో నాలుగు చోట్ల దొరుకుతున్న శివమ్ టీ ఈ పాటకు అచ్చంగా సరిపోతుంది. ఈ టీ గురించి నగరంలోని సనత్నగర్, బల్కంపేట్, అమీర్పేట్ మైత్రివనం ప్రాంతాల్లో తెలియని వారు ఉండరు. ఒక్కసారి రుచి చూశారంటే చాలు.. ‘ఆ చాయ్ చమక్కులే వేరురా భాయ్’ అంటూ చిరంజీవిలా మీరూ పాట అందుకుంటారు. ఒకే చాయ్.. ఒకే రుచి.. ఒకే పేరుతో వెలిసిన ఈ టీ స్టాల్కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ టీ స్టాల్ రాత్రికి రాత్రే ఏర్పాటు చేసింది కాదు.. దీని ఏర్పాటు వెనుక ఓ ఏడాది కష్టం ఉంది. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.