దేశానికి కొత్త వెలుగు
ఇంతింతయి అస్తిత్వ నినాదమంతయి ఆపై ఆత్మ గౌరవమంతయి స్వరాష్ట్ర స్వప్నమంతయి స్వాప్నికుడై సాధకుడై
ఇంతింతయి
అస్తిత్వ నినాదమంతయి
ఆపై ఆత్మ గౌరవమంతయి
స్వరాష్ట్ర స్వప్నమంతయి
స్వాప్నికుడై సాధకుడై
కరువు నేల మీద
అనతికాలంలో తరగని జలదృశ్యమై
విస్తరించిన ఎడారి ఎద మీద
మొలచిన దట్టమైన అటవీ సంపదై
పగలూ రాత్రీ ఆరని
నిరంతర విద్యుత్ తేజమై
తెగని రైతుబంధమై
దేశానికి ధాన్యగార వాగ్దానమై
దేశమే దేహమై
వెలుగు ప్రస్థానాలకు దారులు తీసే
పటిమ తగ్గని పోరాట యోధుడై
సకల సామాజిక రోగాలకు
చికిత్సా సంకల్ప ధన్వంతరై
అనితర సాధ్య వచో విలాసంతో
దేశం దృష్టిని ఆకర్షిస్తున్న
మన మట్టి మనిషి జన్మదినం ఈ రోజు
జాతి చరిత్రకు అద్దనుంది కొత్త వెలుగు!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
99402 33261
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- India
- light
- NT Kavithalu
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

