రాజ్యసభకు స్వపన్ దాస్ గుప్తా రాజీనామా..

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. 2016లో రాజ్యసభకు.. రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 2022 వరకు ఆయన రాజ్యసభలో కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. స్వపన్ దాస్‌గుప్తా బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. అయితే రాజ్యసభకు రాజీనామా చేయకుండా.. ఏ పార్టీలో చేరకుండా.. ఎలా పోటీ చేస్తారని తృణమూల్ ప్రశ్నించింది. పదవ షెడ్యూల్ ప్రకారం స్వపన్ దాస్‌గుప్తాను రాజ్యసభకు అనర్హుడిగా ప్రకటించాలని తృణమూల్ పార్టీ నేత మహువా మొయిత్రి తన ట్వీట్లో కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. ఆ పార్టీ చీఫ్ విప్ జయరామ్ రమేశ్.. రాజ్యసభ చైర్మన్‌కు రాసిన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హౌజ్‌కు రిజైన్ చేయకుండా.. ఏ పార్టీలో చేరకుండా ఎలా స్వపన్ కొనసాగుతారని జయరామ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వపన్ దాస్‌గుప్తా.. స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన వ్యక్తిగా తనకు రాజ్యసభలో ప్రత్యేక హోదా ఉందని, తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాని, అన్ని సమస్యలు ముగిశాకే నామినేషన్ వేస్తానని, మరో రెండు రోజుల్లో నామినేషన్ వేయనున్నట్లు స్వపన్‌దాస్ ఓ మీడియాతో పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

