SSC Jobs | 1748 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల
SSC Jobs | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేయాలనకునేవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సువర్ణావకాశం కల్పించింది. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
SSC Jobs | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ఒక ప్రధాన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం 1748 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్మెంట్ (IMD)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన, అనుభవం ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాలు
SSC JE 2026 నోటిఫికేషన్‌లోని 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం, సైంటిఫిక్ అసిస్టెంట్ (IMD) విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇవి గ్రూప్-బి లెవల్-6 పోస్టులు.

Je Posts
అర్హతలు, వయోపరిమితి
గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీస్సీ, బీఈ, బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులైనవారు అర్హులు. దీంతో పాటు పోస్టును బట్టి ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయసు ఈ ఏడాది ఆగస్టు 1 30 నుంచి 32 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సటీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)లో పేపర్-1, పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌లో పేపర్-1లో 0.25 మార్కులు, పేపర్2లో 1 మార్కు కోత విధిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జీతం నెలకు రూ. 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. కొన్ని పోస్టులకు మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఫిజికల్ స్టాండర్డ్స్‌ను పరీక్షిస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 22. ఇతర వివరాలు వెబ్సైట్ https://ssc.gov.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shrasti Verma | జానీ మాస్టర్‌కు శ్రేష్టి వర్మ కౌంటర్.. ‘నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నోరు మూయించలేరు!’
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

