Sravan Reddy | ’అగధ’ చిత్రంలో శ్రవణ్ రెడ్డి అద్భుత నటన.. హీరోగా, యాంటీ హీరోగా అంతుచిక్కని మాయ!
Sravan Reddy | రెగ్యులర్ కమర్షియల్ హారర్ చిత్రాలకు పూర్తిభిన్నంగా వచ్చిన ‘అగధ’ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని కేవలం ఒక సాధారణ హారర్ సినిమాగా పరిగణించలేమని, మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ఒక సరికొత్త అత్మాస్పిరిక్ థ్రిల్లర్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు చిత్రంలోని ప్రధాన నటీనటుల అసాధారణ అభినయం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తోంది.
Sravan Reddy | రెగ్యులర్ కమర్షియల్ హారర్ చిత్రాలకు పూర్తిభిన్నంగా వచ్చిన ‘అగధ’ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని కేవలం ఒక సాధారణ హారర్ సినిమాగా పరిగణించలేమని, మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ఒక సరికొత్త అత్మాస్పిరిక్ థ్రిల్లర్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు చిత్రంలోని ప్రధాన నటీనటుల అసాధారణ అభినయం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తోంది.
ముఖ్యంగా ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తొలిసారిగా హీరోగా మరియు యాంటీ హీరోగా ద్విపాత్రాభినయం పోలిన వైవిధ్యమైన షేడ్స్‌లో ఆయన కనిపిస్తూ ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తున్నారు. ఆయన పోషించిన పాత్రలో అనేక భావోద్వేగపు పొరలు (లేయర్స్) ఉన్నాయని తెలుస్తోంది. మొదట్లో ఎంతో సహజంగా, మనకు తెలిసిన వ్యక్తిలా కనిపించే ఆ పాత్ర, కథ ముందుకు వెళ్లేకొద్దీ ఒక్కో కొత్త కోణాన్ని బయటపెడుతుంది. ఆ మార్పులను శ్రవణ్ ఎంతో సునాయాసంగా తన అభినయంలో పలికించారు.
అతని నటనలో కనిపించే ఒక ప్రత్యేకమైన ‘అన్‌సెటిలింగ్ క్వాలిటీ’ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కావాలని భయపెట్టడం కాకుండా, ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నామనే భావన ప్రేక్షకుడికి కలగకుండా చేయడం ఆయన నటనలోని ప్రత్యేకత. పాజిటివ్, నెగటివ్ షేడ్స్ మధ్య ఉండే అత్యంత క్లిష్టమైన గ్రే జోన్‌ను శ్రవణ్ చాలా సమర్థంగా పట్టుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఆయన ఎలాంటి డైలాగ్స్ లేకుండా, నిశ్శబ్దంగా ఉన్న క్షణాల్లో కూడా పాత్రలో ఏదో బలమైన రహస్యం దాగి ఉందనే భావన ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటుంది.
సినిమా ఆరంభంలో మనం చూసిన పాత్రను, ముగింపునకు వచ్చేసరికి పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ నటన సాగుతుంది. సినిమా ఎండ్ క్రెడిట్స్ పూర్తయిన తర్వాత కూడా థియేటర్ బయటకు వచ్చాక ప్రేక్షకులను వెంటాడేంతటి కంట్రోల్డ్, అష్యూర్డ్ పెర్ఫార్మెన్స్ను శ్రవణ్ రెడ్డి ఈ చిత్రం ద్వారా అందించారని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

