ఎమ్మీలో స్క్విడ్ గేమ్ హవా..
Squid Game: ఈ యేటి ఎమ్మీ అవార్డ్స్‌లో స్క్విడ్ గేమ్ సిరీస్ చరిత్ర సృష్టించింది. అతి ముఖ్యమైన రెండు అవార్డులను ఆ షో ఎగురేసుకుపోయింది. నాన్ ఇంగ్లీష్ షో .. ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ అవార్డులను గెలుచుకోవడం విశేషం. హ
లాస్ ఏంజిల్స్: ఈ యేటి ఎమ్మీ అవార్డ్స్‌లో స్క్విడ్ గేమ్ సిరీస్ చరిత్ర సృష్టించింది. అతి ముఖ్యమైన రెండు అవార్డులను ఆ షో ఎగురేసుకుపోయింది. నాన్ ఇంగ్లీష్ షో .. ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ అవార్డులను గెలుచుకోవడం విశేషం. హవాంగ్ డాంగ్ హుయిక్కు బెస్ట్ డైరక్టర్ అవార్డు దక్కగా, ఆ సిరీస్‌లో నటించిన లీ జంగ్ జావ్కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న తర్వాత డైరక్టర్ హవాంగ్ .. ఎమ్మె అవార్డు చివరిది కాబోదని, రెండవ సీజన్లోకి ఎంటర్ అవబోతున్నామని అన్నాడు. ఈ షోలో నటించిన లీ యూ మి.. గెస్ట్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకున్నది. స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్ ఫర్ఫార్మెన్స్, ప్రొడెక్షన్ డిజైన్ కేటగిరీల్లోనూ స్క్విడ్ గేమ్ ఎమ్మీ అవార్డులను సొంతం చేసుకున్నది.
2021 సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్క్విడ్ గేమ్ షోను ప్రసారం చేశారు. మెయిన్ డ్రామా కేటగిరీలో నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా స్క్విడ్ గేమ్ అవార్డులు గెలుచుకోవడం ఇదే ప్రథమం. ఎమ్మీలో ఈ షో మొత్తం 14 కేటగిరీల్లో పోటీ పడింది. డబ్బు కోసం చిల్డ్రన్స్ గేమ్ ఆడే వాళ్లు, ఒకవేళ ఆ గేమ్‌లో ఓడిపోతే వాళ్లకు మరణమే శరణం. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన కొరియన్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్.. నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ద హిట్ అయ్యింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

